
జనం న్యూస్ జూలై 20 ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా ) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎస్ సి ఎస్ టి బి సి & మైనార్టీ సలహాదారులు షబ్బీర్ అలీ, నివాసంలో బీబీపేట్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పాలక వర్గ సభ్యులు కలిసి శాల్వతో సత్కరించడం జరిగింది. బీబీపేట్ గ్రామ సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. సర్పంచ్ సాద్విక సాయినాథ్, మాట్లాడుతూ బురుజు దగ్గర వాటర్ ట్యాంక్ సీసీ రోడ్లు జిపి కొత్త భవనం బ్రిడ్జ్ వద్ద వర్షాలతో కొట్టుకుపోయిన బి టి రోడ్డు మరమ్మత్తుల గురించి మేమొరాండం ఇవ్వడం జరిగింది. సానుకూలంగా స్పందించి వెంటనే వెటర్నరీ హాస్పిటల్ సాంక్షన్ లెటర్ సర్పంచ్ పాలక వర్గానికి జెడ్ పి నిధుల నుంచి 17.50 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సాద్విక సాయినాథ్, వార్డ్ మెంబర్లు మొహమ్మద్ ఆసిఫ్, పరకాల రవి, లక్ష్మీ నారాయణ, మహేశ్, భాస్కర్, పాల్గొన్నారు.