
జనం న్యూస్ -మే 22- నాగార్జునసాగర్ టౌన్- ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ల ముందే దగ్ధం అవ్వడంతో ఆ రైతులు కన్నీరు మున్నీరు అవుతున్న సంఘటన విద్యుత షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి పెద్దవూర మండల బాసుని బావి తండా వాసులకు చెందిన 8 సంవత్సరాల వయసున్న బత్తాయి తోట మొత్తం కాలిపోయింది. బాసుని బావి తండాకి చెందిన మూడవత్ ధనకోటి 1-00 ఎకరం , మూడవత్ లక్ష్మణ్ 1-20 ఎకరాలు , మూడవత్ రవీందర్ 1-20 ఎకరాలు ఒకే కుటుంబానికి చెందిన రైతులు సుమారు దాదాపు 4 ఎకరాలు బత్తాయి చెట్లను పెంచుతున్నారు.రోజు లాగానే రైతులు బుధవారం పొలం పనులు ముగించుకొని ఇంటికెళ్లారు.ఇంతలోగా తోట పక్క భాగాన ఉన్న విత్యుత తీగలు ఒకదానికొకటి తగులుకొని నిప్పురవ్వలు బాగా ఎండిపోయి ఉన్న కోసిన వారిపోలం లో మంటలు అంటుకున్నాయి. ఎండిపోయివున్నా గడ్డి విస్తృతంగా మంటలు అంటుకొని పక్కనే ఉన్న బత్తాయి తోటకు అంటుకుంది. దీంతో మంటలు చెలరేగి బత్తాయి చెట్లు, డ్రిప్పు పరికరాలు పూర్తిగా మంటలంటుకున్నాయి. విషయం తెలుసుకున్న రైతులు మంటలను ఆర్పారు.చేతికొచ్చిన బత్తాయి తోట పూర్తిగా కాలిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.ఇంకో నెలరోజుల్లో బత్తాయి పంటకోసే సమయంలో ఇలా జరిగిందని, దాదాపు రూ. 5లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు తెలిపారు. ప్రభుత్వం అదుకోవాలని రైతులు కోరారు.