
జనం న్యూస్ ఆగస్టు 22 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయకుండా అడ్డుకు సాకులు వెతకడం సరికాదని బీఆర్ఎస్ యూత్ మండల నాయకుడు బేరుగు తరుణ్ గోపి అన్నారు. శాయంపేట మండల కేంద్రంలో తరుణ్ గోపి విలేకరులతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేదల ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ అనే గొప్ప పథకాన్ని తీసుకువస్తే, పథకం అమలు చేయలేని అసమర్థ ప్రభుత్వం ఆ పథకాన్ని ఎత్తివేసే కుట్ర చేస్తుందని ఆరోపించారు. పథకం అమలుపై హై కోర్టు స్టే ఇస్తే బీఆర్ఎస్ పోరాటంతోనే ప్రభుత్వం ఇక తప్పదని కౌంటర్ వేశారని అన్నారు. పెళ్ళిళ్ళు చేసి ఆర్థిక భారం కుటుంబం పై పడకుండా ఉన్న పథకంపై కుట్రలు వద్దని హితవు పలికారు. లేదంటే నిరుపేదల ఆగ్రహానికి గురి కాక తప్పదని అన్నారు. పథకం అమలు అయ్యేవరకు బీఆర్ఎస్ పోరాడుతుందని తెలిపారు గ్రామాలలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని, ప్రజల పక్షాన నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు..