
జనం న్యూస్ సెప్టెంబర్ 10 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి జిట్టా రమ్యకృష్ణ సునీల్ యాదవ్‌ను సంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ ఇన్చార్జిగా నియమించిన సందర్భంగా కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం హేమదుర్గ భవన్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా రమ్యకృష్ణ సునీల్ యాదవ్, టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. అనంతరం బండి రమేష్ రమ్యకృష్ణను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ కూకట్పల్లి నియోజకవర్గానికి చెందిన రమ్యకృష్ణకు సంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. యువజన కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేసేందుకు రమ్యకృష్ణ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ యువతను కాంగ్రెస్ పార్టీ వైపు మరింతగా ఆకర్షించేందుకు కృషి చేయాలని ఆకాంక్షించారు.యువజన కాంగ్రెస్ బలోపేతానికి కూకట్పల్లి నియోజకవర్గం నుంచి రమ్యకృష్ణ చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ బాధ్యత దక్కడం గర్వకారణమని నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గ సీనియర్ నాయకులు జిట్టా సునీల్ కుమార్ యాదవ్, బోయినపల్లి మార్కెట్ కమిటీ సభ్యులు అస్లాం, మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సుశీల్ యాదవ్, కూకట్పల్లి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ నాయకులు బుజ్జి, యశ్వంత్, భాను, సంతు, యోగి తదితరులు పాల్గొన్నారు