
జనం న్యూస్, జూన్ 03, జగిత్యాల జిల్లా మెట్ పల్లి : మెట్ పల్లి మండల సర్పంచుల ఫోరమ్ ఎన్నిక పార్టీలకు అతీతంగా ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది, మండల అధ్యక్షులుగా వెల్లుల్ల సర్పంచ్ గూడూరు తిరుపతి, ఉపాధ్యక్షులుగా చెర్ల కొండాపూర్ సర్పంచ్ బాస లాస్య ఆనంద్,ప్రధాన కార్యదర్శి గా రంగారవుపేట్ సర్పంచ్ గుర్రం బాలరాజు, కోశాధికారిగా కోనరావుపేట సర్పంచ్ మారు గంగారెడ్డి గార్లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో మెట్ పల్లి మండల సర్పంచ్ లు అందరూ పాల్గొని నూతన కార్యవర్గాన్ని అభినందించారు, సర్పంచుల సమస్యలు ఉన్నతాధికారుల దృష్టికి కార్యవర్గం తీసుకెళ్లాలని కోరారు