
జనం న్యూస్, జులై 23, జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం: సర్పరాజ్‌పూర్ గ్రామంలో మహిళా సంఘాల అభివృద్ధి, సమావేశాలు మరియు వివిధ సంక్షేమ కార్యక్రమాల నిర్వహణ కోసం రూ.10.00 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన మహిళా సంఘ భవనానికి కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ శంకుస్థాపన చేసి భూమి పూజ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మహిళా సంఘాల కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన మౌలిక వసతులను కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాలు స్వయం ఉపాధి, పొదుపు, ఉపాధి కల్పనతో పాటు సామాజిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు.సర్పరాజ్‌పూర్ గ్రామంలో నిర్మించనున్న ఈ మహిళా సంఘ భవనం మహిళా సంఘాల సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే అన్నారు. గ్రామాభివృద్ధికి అవసరమైన ప్రతి పనిని దశలవారీగా పూర్తి చేస్తామని, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రామకృష్ణ , దారిశెట్టి రాజేష్ , గ్రామ సర్పంచ్ నత్తి రాజ్‌కుమార్, ఉప సర్పంచ్ బండారి భూమేష్ , ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ పెద్దలు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.