
జనం న్యూస్ జూల పది ముమ్మిడివరం (ప్రతినిధి గ్రంధి నానాజీ) *:* డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ముగియడానికి కేవలం ఐదు రోజులే సమయం ఉండటంతో అధికారులు వేగం పెంచి గడువును పొడిగించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం కోరారు.ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ గత నెల జూన్ 14 నుండి జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల జూలై 14తో ఈ ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో కొత్తపేట నియోజకవర్గంలో ఎన్యుమరేషన్ ఫారాలను ప్రజలకు బూత్ ల వారీగా 100 శాతం పంపిణీ చేశారని, సేకరించిన ఫారాల డిజిటలైజేషన్ ను అధికారులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఇప్పటికీ ఇళ్లు మారినవారు, అడ్రస్ మారినవారు, వలస వెళ్లినవారు, మరణించిన వారి వివరాల నమోదు పెండింగ్లో ఉందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉండేలా అధికారులు ఫీల్డ్ స్థాయిలో వివరాలు సేకరించి ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. జిల్లాలో కొత్తపేట నియోజకవర్గం డిజిటలైజేషన్లో మొదటి స్థానంలో ఉండేలా అధికారులు కృషి చేయాలని పాలూరి సత్యానందం అధికారులను కోరారు.