
జనం న్యూస్ 3 ఆలేరు యాదాద్రి జిల్లా మండల రిపోర్టర్ ఎండి జహంగీర్ ఆలేరు పట్టణ కేంద్రంలోని సాయిబాబా గుడిలో అర్ధరాత్రి చోరీకి పాల్పడిన దుండగులు స్థానిక ఎస్ హెచ్ ఓ ఉదయ్ కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం అర్ధరాత్రి న దొంగలు గుడి వెనుక ద్వారం నుండి తాళాలు పగలగొట్టి గుడిలో చోరబడి వెండి ఆభరణాలు దొంగలించడానికి ప్రయత్నించారు వాచ్మెన్ మేలుకొని గగ్గోలు పెట్టడంతో అక్కడికక్కడే వదిలివేసి పారిపోయారు గుడి నిర్వాహకులను సీసీ కెమెరాలు అందుబాటులో ఉండాలని పోలీసులు సూచించారు అతి త్వరలో దొంగలను పట్టుకుని చట్టానికి అప్పగిస్తామని తెలిపారు దర్యాప్తులో పాల్గొన్న రూరల్ ఎస్సై వినయ్ కుమార్ క్రైమ్ పార్టీ చంద్రశేఖర్ క్లూస్ టీం పాల్గొని దర్యాప్తు చేస్తున్నాము అని తెలిపారు