
జనం న్యూస్ : 22 మే శుక్రవారం ; సిద్దిపేట నియోజికవర్గం ఇంచార్జ్ వై.రమేష్ ;వాట్ నెక్స్ట్ కెరియర్ సర్వీస్ ఆధ్వర్యంలో ఈరోజు 22 మే 2026 సిద్దిపేటలోని విపంచి కళానిలయం సముదాయం లో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థుల కోసం గ్రాడ్యుయేషన్ కోర్సులు మరియు భవిష్యత్ కెరీర్ అవకాశాలపై ఉచిత అవగాహన శిబిరం నిర్వహించబడింది.ఈ కార్యక్రమాని కి విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరై వివిధ డిగ్రీ కోర్సులు, కాలేజీ ఎంపికలు, ఉద్యోగ అవకాశాలు, ఉన్నత విద్య అవకాశాలపై నిపుణుల నుంచి సమాచారం తెలుసుకున్నారు. విద్యార్థుల సందేహాలకు సమగ్ర సమాధానాలు అందించడంతో పాటు వారి ఆసక్తులు, భవిష్యత్ లక్ష్యాలకు అనుగుణంగా సరైన కోర్సులను ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఈ అవగాహన శిబిరం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా నిలిచి విజయవంతంగా ముగిసింది.