
జనం న్యూస్, ఆగస్టు 5 (బుధవారం): సిద్దిపేట నియోజకవర్గ ఇన్చార్జి వై. రమేష్; సిద్దిపేటలో టీఆర్‌ఎంఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు పడిగే భాస్కర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు పోచమ్మల వెంకటేశం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహులు చేతుల మీదుగా వెల్లి గ్రామ మాజీ సర్పంచ్ కొండ్ర సుగుణ ముదిరాజ్‌కు టీఆర్‌ఎంఎస్ సిద్దిపేట జిల్లా మహిళా అధ్యక్షురాలి నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ముదిరాజ్‌ల ఐక్యత కోసం జిల్లాలో చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర నాయకత్వం సూచించింది. కొండ్ర సుగుణ ముదిరాజ్ మాట్లాడుతూ, రాష్ట్ర నాయకత్వంతో పాటు జిల్లా అధ్యక్షులు పడిగే భాస్కర్ ముదిరాజ్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ, జిల్లాలో ముదిరాజ్‌ల ఐక్యత కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.