
జనం న్యూస్ ;11 జూన్ గురువారం;సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ ; ప్రపంచ పర్యావరణ దినోత్సవం–2026 సందర్భంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “99 డేస్ యాక్షన్ ప్లాన్ – ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్), సిద్దిపేటలో ప్లాస్టిక్ కాలుష్య నిర్మూలన, పర్యావరణ పరిరక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా. జి. సునీత అధ్యక్షత వహించగా వైస్ ప్రిన్సిపల్, డా. పి. అయోధ్య రెడ్డి, ఎకో క్లబ్ కన్వీనర్ డా. ఎం. మధుసూదన్ రెడ్డి, జిల్లా కాలుష్య నియంత్రణ మండలి జిల్లా కోఆర్డినేటర్ రవీందర్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డా. సి హెచ్ .మధుసూదన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ, ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి, జీవవైవిధ్యానికి, మానవ ఆరోగ్యానికి కలుగుతున్న హానిని వివరించారు. ఒక్కసారి ఉపయోగించే ప్లాస్టిక్ వస్తువులను పూర్తిగా నిరాకరించి, వాటికి ప్రత్యామ్నాయంగా వస్త్ర సంచులు, స్టీల్ గ్లాసులు స్టీల్ ప్లేట్లు వివిధ ఆకులతో చేయబడిన ప్లేట్లు జ్యూట్ బ్యాగులు లాంటి పర్యావరణ హిత ఉత్పత్తులను మరియు బయోడిగ్రేడబుల్ ఉత్పత్తులను ఉపయోగించాలని సూచించారు. ప్రతి విద్యార్థి పర్యావరణ పరిరక్షణలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ అధికారులు మరియు ఎన్ సిసి అధికారి , ఎన్సీసీ కేడెట్లు, విద్యార్థిని–విద్యార్థులు, మరియు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి పనిచేయాలని ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినందుకు కళాశాల యాజమాన్యం తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు, అధ్యాపకులకు, విద్యార్థులకు అభినందనలు తెలియజేసింది.