
జనం న్యూస్ :20 మే బుధవారం:సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్;అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రాంతీయ సమన్వయ కేంద్రంలో నాలుగు రోజుల వ్యక్తిత్వ వికాస శిక్షణ తరగతులు విజయవంతంగా ముగిశాయని రీజినల్ కో ఆర్డినేటర్ డాక్టర్ ఎం. శ్రద్ధానందo తెలిపారు.తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక-99 రోజులు లో భాగంగా ఈ శిక్షణ నిర్వహించారు. ఈ నాలుగు రోజుల్లో పలువురు ప్రముఖ వ్యక్తులు పాల్గొని విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారని ఆయన వివరించారు.