
జనం న్యూస్ :15 ఆగస్టు శనివారం : సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ;సిద్దిపేటలో లయన్స్ క్లబ్ ఆఫ్ సిద్దిపేట ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను రంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సిద్దిపేట అధ్యక్షులు లగిశెట్టి నరసింహులు జెండాను ఆవిష్కరించారు.అనంతరం విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు లగిశెట్టి నరసింహులు, ఉపాధ్యక్షులు చింత భాస్కర్, ట్రెజరర్ ,బి. శ్రీనివాస్, బొమ్మర రాజు, బొమ్మర ప్రసాద్, లయన్స్ క్లబ్ సభ్యులు, అభయజ్యోతి మానసిక దివ్యాంగుల పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటుతూ నిర్వహించిన ఈ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది.