
సెప్టెంబర్ గురువారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్ :ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షులు, జనసేన పార్టీ సిద్దిపేట నియోజికవర్గ ఇంచార్జి దాసరి పవన్ ఆధ్వర్యంలో సిద్దిపేట లో ఘనముగా నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమం లో భాగంగా ఉదయం శరబెశ్వరా ఆలయం లో అభిషేకం. అర్చన. పూజ కార్యక్రమలు అనంతరం బైక్ ర్యాలీ, అంబేద్కర్ విగ్రహనికి పాలాభిషేకం పూల మాల వేసి నివాళులు అర్పించిన తరువాత ప్రభుత్వ ఆసుపత్రి లో పండ్ల పంపిణి. రక్తదాన శిబిరం. నిర్వహించడం అనంతరం అభయ జ్యోతి మానసిక వికలాంగుల కేంద్రం లో కేక్ కటింగ్, మహిళలకు చీరల పంపిణి, అన్నదాన కార్యక్రమం, జనసైనికుల ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగినది.ఈ సందర్బంగా దాసరి పవన్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావాలని, తెలంగాణా లో రానున్న ఎన్నికలల్లో ఎంపీటీసీ. జడ్పీటీసీ ఎన్నికలల్లో ప్రతి ఒక నాయకుడు పోటీచేయాలన్నారు. రాష్ట్రము లో జనసేన విజయం సాధిస్తే బీసీ ముఖ్యమంత్రి అవుతారని పవన్ కళ్యాణ్ తెలిపిన విషయాన్నీ గుర్తుచేసారు.తెలంగాణా వ్యాప్తంగా జనసేన పార్టీ లోకి పెద్ద ఎత్తున చేరికలు రానున్న రోజులలో జనసేన విజయానికి సూచిక అన్నారు.ఈ కార్యక్రమాలలో గొడుగు శివ. కృష్ణ. మల్లేశం. ప్రశాంత్. బాలు. నరేష్.ఐమాద్. రఘు. అక్కలదేవి రమేష్. హరీష్. శ్రీనివాస్. రవి. మహేష్. సురేష్.స్వామి. అజయ్.లక్ష్మణ్ తదితర నాయకులు పాల్గొన్నారు.