
జనం న్యూస్ మే 15 ఇంకా పల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ : ఆరోగ్యం సరిగా లేక ఆసుపత్రిలో చేరి ఆపరేషన్ చేసుకోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న 81వ వార్డుకు చెందిన ఇద్దరు వ్యక్తులకు శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా ఈరోజు ఉదయం జనసేన కార్యాలయంలో జనసేన ఇన్చార్జ్ భీమరశెట్టి రామ్ కి ఆపరేషన్ చేసుకున్న లబ్ధిదారులకు శ్రీమతి సిరివరపు అన్నపూర్ణ ₹ 77500, కనిశెట్టి జగదీశ్వరరావు ₹ 43500 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కూటమి నాయకులు సమక్షంలో రామ్కీ అందించారు. ఈ సందర్భంగా ఇరువురి కుటుంబ సభ్యులు కొణతాల రామకృష్ణకు రాంకీ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు మల్ల గణేష్ మాట్లాడుతూ 81 వార్డు లో మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఇరువురు అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వ్యక్తులు కుటుంబాలను శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ ఆదుకున్నారని, వారు చేసిన సేవ మరిచిపోలేమని, ఇటువంటి వ్యక్తులకు ముఖ్యమంత్రి సహాయనిది నుండి మంజూరు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి 81 వ వార్డు తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని గణేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ నూకంబిక అమ్మవారి దేవస్థానం చైర్మన్ పిలా నాగ శ్రీను కాండ్రేగుల ఉమా బుద్ధ శ్రీనివాసరావు కాండ్రేగుల గోపికృష్ణ రేఖా రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.