
జుక్కల్ ఆగస్టు 3 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండలం నాగల్ గావ్ గ్రామంలో క్షేత్ర స్థాయిలో సాగు అవుతున్న సోయాబీన్, ప్రత్తి,పెసర, పుచ్చకాయ, మిరప తదితర పంటలను నాగుల్గావ్ క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి సతీష్ చిద్రవార్ పరిశీలించి రైతులకు తగు సలహాలు,సూచనలు ఇవ్వడం జరిగింది. సోయాబీన్ పంటలో ఐరన్ లోపం, పచ్చ పురుగు గమనించి దాని నివారణకు ఫార్ములా 6 @ 200గ్రాములు ఎకరాకు దానితో పాటు 19.19.19@1kg ఎకరాకు ,వేపనూనె (1500ppm) 500 ml ఎకరాకు+ అసిఫేట్ 300గ్రాములు ఎకరాకు+ ప్రొఫెనోఫోస్ 40 EC 400 ml ఎకరాకు మొదటి స్ప్రే గా చేసుకోవాల్సిందిగా రైతు సోదరులకు వివరించడం జరిగింది.ప్రత్తి పంటలో ప్రధానంగా రసం పీల్చే పురుగులు అయిన తెల్ల దోమ,పచ్చ దోమ, పెనుబంక గమనించి దాని నివారణకువేప నూనె(1500ppm) 500ml ఎకరాకు + అసేటమిప్రిడ్ 50 గ్రాములు ఎకరాకు లేదా ఫిప్రోనిల్ 200ml ఎకరాకు లేదా అసిఫేట్ మరియు ఇమిడాక్లోప్రిడ్ (లాన్సర్ గోల్డ్) 250గ్రాములు ఎకరాకు 200లీటరు ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలని రైతు సోదరులకు వివరించడం జరిగింది. అదేవిధంగా ప్రత్తి పంటలో అధిక తేమ వలనపార విల్ట్ గమనించి దాని నివారకు కాపర్ ఆక్స్ క్లోరైడ్ ( COC) 500గ్రాములు ఎకరాకు + 19.19.19 ఒక కేజీ ఎకరాకు కలిపి పిచికారి చేసుకోవాలని సూచించడం జరిగింది.పుచ్చకాయ పంటలో ఆకు ముడత, కుకుంబర్ మొజాయిక్ తెగుళ్లు గమనించి దాని నివారణకు వేపనూనె (1500ppm) 500 ml ఎకరాకు + తియోమితక్షమ్ 50గ్రాములు ఎకరాకు లేదా ఫ్లునికామిడ్ (ఉలల) 60గ్రాములు ఎకరాకు కలిపి పిచికారి చేయాలని సూచించడం జరిగింది. మిరప పంటలో రసం పీల్చే పురుగులు అయిన తామర పురుగు (ఆకు పై ముడత),నల్లి ( ఆకు కింది ముడత) గమనించి దాని నివారణకు వేప నూనె (1500ppm) 500 ml ఎకరాకు + ఫిప్రోనిల్ 200ml ఎకరాకు + Fenpyroximate 200ml ఎకరాకు లేదా వెట్టబుల్ సల్ఫర్ 600గ్రాములు లేదా Propargite 57% EC 400ml ఎకరాకు కలిపి పిచికారి చేయాలని రైతు సోదరులకు వివరించడం జరిగింది. క్షేత్ర స్థాయి సందర్శనలో రైతు సోదరులు శివరాం ప్రకాష్, హరి విట్టోబ పటేల్, సూర్యవంశీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.