
జనం న్యూస్ నందలూరు , కడప జిల్లా 16-05-26 భారతీయ జనతా పార్టీ రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షులు సాయి లోకేష్ సూచనల మేరకు విశాఖ పట్టణం నందు సౌత్ కోస్ట్ రైల్వే డిప్యూటీ జనరల్ మేనేజర్ వై బాలాజీ కిరణ్ ని నందలూరు రైల్వే స్టేషన్ కన్సల్టేటివ్ మెంబర్ రాచూరి మురళి కలిసి గుంత కల్ డివిజన్ లో భాగమైన అతి ప్రాచీన ముఖ్యమైనటు వంటి నందలూరు రైల్వే స్టేషన్ నందు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మరియు రాయలసీమ ఎక్స్ ప్రెస్ ముంబై చెన్నై ట్రైన్లు నిలుపుదల లేకుండా ఉండటం వలన విద్యార్థులు, ఉద్యోగస్తులు, రైల్వేఉద్యోగస్తులు,యువత ఇలాగా అన్ని వైపులా నందలూరు మండల ప్రజలు రైలు ప్రయాణ సౌకర్యాల కోసం తీవ్ర మైనటు వంటి ఇబ్బందులు గురిఅవుతు న్నారు కనుక ఈ యొక్క ట్రైన్స్ నిలుపు దల చేయవలసి నదిగా కోరడంజరిగినదిఅందుకుగాను సౌత్ కోస్ట్ రైల్వే డిప్యూటీ జనరల్ మేనేజర్ వై.బాలాజీ కిరణ్ మాట్లాడు తూ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ,రాయలసీమ ట్రైన్లు నిలుపుదల ఖచ్చితముగా నందలూరు రైల్వే స్టేషన్ నందు ట్రైన్ స్టాపేజింగ్ ఇస్తామని చెప్పడం జరిగి నది అందుకు గాను ముందస్తుగా సౌత్ సెంట్రల్ రైల్వే మరియు సౌత్ కొస్ట్ రైల్వే ఉన్నత అధికారులు ఈ యొక్క స్టాపేజెస్ ల గురించి ప్రతిపాదనలు జరుగుతున్నాయని తెలపడం జరిగినది. కనుక ఈ యొక్క ట్రైన్స్ స్టాపింగ్స్ ఖచ్చితం గా ఇస్తామని తెలపడం జరిగినది. ఇందుకుగాను సౌత్ కోస్ట్ రైల్వే డిప్యూటీ జనరల్ మేనేజర్ వై బాలాజీ కిరణ్ కి రాచూరి మురళి కృతజ్ఞ తలు తెలపడం జరిగినది.