
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా నందలూరు : నాగిరెడ్డిపల్లె మేజర్ గ్రామ పంచాయతీ అరవపల్లి లోని నందలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో స్మార్ట్ కిచెన్ నిర్మాణం కోసం రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జ్.చమర్తి
జగన్మోహన్ రాజు,సబ్ కలెక్టర్ హెచ్ ఎస్ భావన లతో కలిసి జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ గురువారం సాయంత్రం స్థలాన్ని పరిశీలించారు. ఈ నేపథ్యంలో పలువురు క్రీడాకారులు, ప్రజలు క్రీడా మైదానంలో స్మార్ట్ కిచెన్ నిర్మిస్తే ఇబ్బందులు తలెత్తు తాయని చమర్తి జగన్మోహన్ రాజు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్య క్రమంలో తాహసిల్దార్ ఎం.సుజాత, ఎంపీడీవో కే ఆర్ ఎం ప్రసాద్, డిప్యూటీ డి.ఇ.ఓ నాగయ్య,తదితరులు పాల్గొన్నారు.