
జనం న్యూస్ ;29 ఆగస్టు శనివారం ; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్: రాఖీ పౌర్ణమి సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని బ్రహ్మకుమారీస్ సంస్థ ఆధ్వర్యంలో మూడు రోజులుగా రక్షాబంధన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సంస్థ నిర్వాహకురాలు బీకే భవాని సిద్దిపేట పట్టణ ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.
రాఖీ పౌర్ణమి సందర్భంగా సిద్దిపేట కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ కే. లక్ష్మీకిరణ్, ఏఓ శ్రీనివాస్ పాటు జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలోని అధికారులకు రాఖీలు కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎస్బీఐ బ్యాంకు కార్యాలయంలో మేనేజర్‌తో పాటు సిబ్బందికి రాఖీలు కట్టి రక్షాబంధన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా బీకే భవాని మాట్లాడుతూ రక్షాబంధనం అన్నాచెల్లెళ్ల, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానుబంధానికి, పరస్పర రక్షణకు ప్రతీకగా నిలిచే పవిత్రమైన పండుగ అని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ముందుగా స్వయంరక్షణ, మర్యాదల రక్షణతో పాటు సమాజ రక్షణకు కృషి చేయాలని సూచించారు. అప్పుడే సమాజంలో ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో, ప్రశాంతంగా జీవించగలరని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి బీకే స్వప్న, సంస్థ సభ్యులు వై. ఓంకారం, అమరేందర్ రెడ్డి, విమల, బిందు తదితరులు పాల్గొన్నారు.