
జనం న్యూస్ జులై 10 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భూ ఖనిజాభివృద్ధి శాఖ మాజీ చైర్మన్ స్వర్గీయ వడ్డేపల్లి నర్సింగ్ రావు 74వ జయంతి సందర్భంగా కూకట్పల్లి వివేకానంద నగర్ కాలనీలో ఘనంగా వేడుకలు నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా వారి కుమారుడు, రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు వివేకానంద నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన వీ.ఎన్.ఆర్ జయంతి కార్యక్రమంలో పాల్గొని, తన తండ్రి స్వర్గీయ వడ్డేపల్లి నర్సింగ్ రావు విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి వీఎన్ఆర్ మరియు వి.ఆర్.ఆర్ అభిమానులకు కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వడ్డేపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ, "స్వర్గీయ వడ్డేపల్లి నర్సింగ్ రావు ప్రజాసేవనే పరమావధిగా భావించి నిరంతరం ప్రజల సంక్షేమం కోసం కృషి చేసిన గొప్ప నాయకుడు. ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేసిన ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ప్రతి ఒక్కరి బాధ్యత. యువత సమాజ సేవను లక్ష్యంగా చేసుకుని ఆయన చూపిన మార్గంలో నడవాలి. వారి సేవలు, విలువలు మరియు ఆదర్శాలు చిరస్థాయిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోతాయి" అని అన్నారు.ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బీజేపీ నాయకులు, కాలనీ ప్రముఖులు, అభిమానులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వర్గీయ వడ్డేపల్లి నర్సింగ్ రావు కి ఘన నివాళులు అర్పించారు.