
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ అఫ్ ఇండియా ఆధ్వర్యంలో నాగిరెడ్డిపల్లి మేజర్ పంచాయతీ ఆరవపల్లి బంగ్లా ఆవరణము నందు రక్తదాన శిబిరం నిర్వహించారు. చాలామంది యువత స్వచ్ఛంద సమాజ సేవకులు అనేక మందిప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు నిర్వాహకులు డేవిడ్ కళ్యాణ్ రాజ్ మాట్లాడుతూ రక్తదాన శిబిరం చేయడం ద్వారా అనేక మందికి అత్యవసర పరిస్థితులలో అనేకమంది ప్రాణాలు కాపాడే అవకాశం ఉందని ఆరోగ్యవంతు లైన ప్రజలు అనేకమంది రక్తదానం ముందుకు వచ్చారని రక్తదానం ఇచ్చిన దాతలను హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు ప్రాణదానం అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు సామాజిక బాధ్యత మానవత విలువలు పెంపొందించే కార్యక్రమం చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మదర్ల్యాండ్విక్టరీ అసోసియేషన్ అధ్యక్షుడు వేపకుండా సామ్రాజ్ అధ్యక్షతన స్కౌట్ గ్రూప్ సభ్యులు అదేవిధంగా హ్యూమన్ రైట్స్ సంబంధించిన సభ్యులు గురువుగారి వాసు వీరబల్లి జయ్ కుమార్ రెడ్డి పటాన్ మె హర్ ఖాన్ రైల్వే కన్సల్టెంట్ మెంబర్ రాచూరి మురళి సయ్యద్ అమీర్ ఆండ్ర శివారెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు