
జనం న్యూస్ 09 జూన్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ పోలీసుల చర్యలు చట్టబద్ధమేగద్వాల తేదీ: 08-06-2026జోగులాంబ గద్వాల జిల్లా పుదూర్ గ్రామంలోని సర్వే నెం.368లో ప్రభుత్వానికి చెందిన 10 ఎకరాల భూమిలో 10+2 కోర్టులు కోర్టు మరియు ఫ్యామిలీ కోర్టు భవన సముదాయం నిర్మాణానికి తెలంగాణ హైకోర్టు పరిపాలనా విభాగం అధికారికంగా చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ (అడ్మినిస్ట్రేషన్) & ఫ్యాక్. రిజిస్ట్రార్ (ఇన్ఫ్రాస్ట్రక్చర్) వారు ఆర్ ఓ సి No.433/2019-(బి) తేదీ 30-05-2026 ద్వారా జోగులాంబ గద్వాల ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి కి లేఖ రాసి శంకుస్థాపన కార్యక్రమానికి ప్రతిపాదనలు పంపాలని మరియు సంబంధిత భూమిని ఆర్ & బి శాఖకు అప్పగించాలని సూచించారు.ఈ నేపథ్యంలో హైకోర్టు పరిపాలనా నిర్ణయానికి వ్యతిరేకంగా కొందరు న్యాయవాదులు నిరవధిక దీక్ష చేపట్టడానికి ప్రయత్నించడం విచారకరం. హైకోర్టు నిర్ణయాలపై ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేయాలనుకుంటే చట్టబద్ధమైన మార్గాల్లో సంబంధిత అధికారులను హైకోర్టును లేదా ఇతర న్యాయపరమైన వేదికలను ఆశ్రయించవచ్చు. అయితే న్యాయవ్యవస్థకు సంబంధించిన పరిపాలనా నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కోర్టు కార్యకలాపాలకు అంతరాయం కలిగించే విధంగా ఆందోళనలు చేపట్టడం సమర్థనీయం కాదు.భారత సుప్రీంకోర్టు (2003) 2 యస్ సి సి 45 కేసులో న్యాయవాదులకు సమ్మెలు కోర్టుల బహిష్కరణలు లేదా న్యాయపరమైన కార్యకలాపాలకు ఆటంకం కలిగించే కార్యక్రమాలు నిర్వహించే హక్కు లేదని స్పష్టంగా ప్రకటించింది. న్యాయవాదుల ప్రధాన బాధ్యత కోర్టుల సజావు నిర్వహణకు సహకరించడం మరియు న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని కాపాడడమే.అలాగే ప్రతిపాదిత నిరవధిక దీక్షకు సంబంధించి సంబంధిత అధికారుల నుండి ఎటువంటి ముందస్తు అనుమతి పొందినట్లు సమాచారం లేదు. ప్రజా శాంతిభద్రతలు కోర్టు ప్రాంగణ భద్రత మరియు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించే బాధ్యత పోలీసు శాఖపై ఉంటుంది ఈ నేపథ్యంలో చట్టం మరియు శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా పోలీసులు దీక్ష శిబిరాన్ని తొలగించడం వారి చట్టబద్ధమైన విధుల్లో భాగమే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే హక్కు ఉన్నప్పటికీ ఆ హక్కు చట్టబద్ధమైన పరిమితులకు లోబడి ఉంటుంది అనుమతి లేకుండా లేదా లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తే పరిస్థితుల్లో చేపట్టే కార్యక్రమాలపై పోలీసులు చర్యలు తీసుకోవడం చట్టబద్ధమైన ప్రక్రియ.గద్వాల జిల్లాలో కోర్టు భవనాల నిర్మాణం జిల్లా ప్రజలకు న్యాయవాదులకు మరియు న్యాయవ్యవస్థకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూర్చే అభివృద్ధి కార్యక్రమం. కాబట్టి వ్యక్తిగత అభిప్రాయ భేదాలకు అతీతంగా జిల్లా అభివృద్ధి మరియు న్యాయసేవల విస్తరణకు అందరూ సహకరించాలని కోరుతున్నాము కృష్ణారెడ్డి జనరల్ సెక్రటరీ గద్వాల బార్ అసోసియేషన్ గద్వాల జిల్లా న్యాయవాదుల