
జనం న్యూస్, జూన్ 02,అచ్యుతాపురం : అచ్యుతాపురం సెజ్ పరిధిలో ఉన్న హైటెక్ పరిశ్రమలో పనిచేస్తున్న రాంబిల్లి మండలం పంచదార్ల గ్రామానికి చెందిన పిల్లి అప్పారావు ( 44 )సొమ్మసిల్లి పడిపోవడంతో అచ్చుతాపురం ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించడం జరిగిందని, ఆయన మృతి చెందడంతో మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారని ఈ మృతి పై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకొని బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్ రాము, కె. సోము నాయుడు డిమాండ్ చేశారు.