
జనం న్యూస్ 4 ఆలేరు యాదాద్రి జిల్లా మండల రిపోర్టర్ ఎండి జహంగీర్ ఆలేరు పట్టణ కేంద్రంలోని దొంతిరి సోమిరెడ్డి గార్డెన్ లో శుక్రవారం రోజున ఆలేరు నియోజకవర్గం బిఆర్ఎస్ మహిళాలు కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో మహిళల హామీలు అమలు కాలేదని నిరసన వ్యక్తం చేస్తూ వంటావార్పు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే మాజీ ప్రభుత్వ విప్ గొంగడి సునీత మహేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ మహిళలకు హామీల అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు మహిళలకు 2500 ఆర్థిక సహాయం కెసిఆర్ కిట్ తులం బంగారం విద్యార్థులకు స్కూటీలు వంటి ఎన్నో హామీలు ఇంకా అమలు కాలేదని మహిళలకు న్యాయం జరగలేదని రానున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వ మని మహిళలు కేసీఆర్ ప్రభుత్వం కోరుతున్నారని అన్నారు పాల్గొన్నవారు నియోజకవర్గ మండల మహిళా నాయకురాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు