
జనం న్యూస్ జూన్ 11, వికారాబాద్ జిల్లాపరిగి మున్సిపల్ పరిధిలోని 13వ వార్డులో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం వార్డు కౌన్సిలర్ మీర్ సమీనా తాహేర్ అలీ ఆధ్వర్యంలో వార్డు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలు డ్రైనేజీ, సీసీ రోడ్లు, పెన్షన్లు, విద్యుత్ అలాగే తాగునీటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రజిత వెంకటేష్, కమిషనర్ మల్లేష్, వార్డు ఆఫీసర్ ఫరూక్, బిల్ కలెక్టర్ శేఖర్, జూనియర్ అసిస్టెంట్ రామకృష్ణ పాల్గొని ప్రజల సమస్యలను విన్నారు. అనంతరం 13వ వార్డులో నెలకొన్న పలు మౌలిక సదుపాయాల సమస్యల పరిష్కారం కోసం కౌన్సిలర్ సమీనా తాహేర్ అలీ మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు.బీసీ కాలనీలో వర్షపు నీరు ఇళ్లలోకి చేరుతున్నందున డ్రైనేజీ సౌకర్యాలు కల్పించాలని, వార్డులో విద్యుత్ స్తంభాల కొరత, లో-వోల్టేజ్ సమస్యలను పరిష్కరించాలని కోరారు. అలాగే అంగన్వాడీ కేంద్రం, రేషన్ దుకాణం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధిత శాఖల ద్వారా తక్షణ చర్యలు చేపట్టాలని కమిషనర్‌ను కోరారు.ఈ కార్యక్రమంలో సంతు నరేందర్, చాంద్, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ సమీర్, ఖదీర్, అంజద్, యూసుఫ్, విద్యుత్ శాఖకు చెందిన సమద్‌తో పాటు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.