
జనం న్యూస్ అక్టోబర్ 6 బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 1985 -86 పదవ తరగతి బ్యాచ్ సోమవారం చింతకింది కళాకారు వక్తగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా 40 సంవత్సరాల తర్వాత నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు అందరూ ఒకరికొకరు ఆలింగణం చేసుకొని ఎంతో ఆనందంతో ఒక పండగ లాగా ఈ ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త శుభాశ్ రెడ్డి, ఉపాధ్యాయులను ఘనంగా విద్యార్థులు సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని దుద్దెల విశ్వ ప్రసాద్ మట్ట శ్రీనివాస్ నంగునూరు చంద్రశేఖర్ ఎంబారి శ్రీనివాస్ లు కలిసి ఆర్గనైజేషన్ చేశారు.