
జనం న్యూస్ 20 -07-2026 జహీరాబాద్ మున్సిపాలిటీ 25వ , వార్డ్ కౌన్సిలర్ ఎండి జాకీర్ ఎన్టీఆర్ చౌరస్తా వద్ద మట్టితో నిండిపోయిన మోరీలనుమున్సిపల్ కార్మికులతో స్వయంగా దగ్గరుండి శుభ్రం చేయించడంచాలా అభినందనీయమైన విషయం.ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించి, వర్షాల కాలంలో డ్రైనేజీలు బ్లాక్ అవ్వకుండా ముందస్తుగా మట్టిని తీయించడం వల్ల స్థానిక ప్రజలకు, వాహనదారులకు పెద్ద ఉపశమనం కలుగుతుంది.ఒక బాధ్యతాయుతమైన ప్రజా ప్రతినిధిగా ఆయన చేసిన ఈ మంచి పని వార్డు పరిధిలో డ్రైనేజీ వ్యవస్థ సజావుగా సాగడానికి ఎంతగానో దోహదపడుతుంది. అంతేకాకుండా ఎన్నో సంవత్సరాల నుండి మోరీలు మట్టితో నిండిపోయినప్పటికీ గతంలో కౌన్సిలర్లు లేకపోయినా యారు నూతన కౌన్సిలర్ జాకీర్ భాయ్ సమస్యలపై దృష్టి పెట్టారుజహీరాబాద్ నుండి తాండూరు వెళ్లే రహదారి కి డ్రైనేజ్ లైన్ లేక మురికి నీరు మొత్తం రోడ్డుపైన ప్రవేశిస్తుంది రోడ్డు మొత్తం ముంతలమయంతో పాడైనప్పటికీ కనీసం మోరి కాలువలు నిర్మించాలన్న ఆలోచన లేకపోవడం చాలా బాధాకరం మున్సిపాలిటీ అధికారులు మాత్రం ట్యాక్స్ వసూలు చేస్తున్నారు కానీ రోడ్డుకు రెండు వైపులా కాల్వలో నిర్మించకపోవడం అనేకసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ జహీరాబాద్ నియోజకవర్గంలో పార్లమెంట్ సభ్యులు ఉన్నారు శాసనసభ్యులు ఉన్నారు చైర్మన్లు ఉన్నారు మున్సిపాలిటీ కమిషనర్ ఉన్నప్పటికీ కూడా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు అని 25 వ వార్డు కౌన్సిలర్ జాకీర్ బాయ్ ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా ప్రజలు జరుగుతున్న ఇబ్బందిని గుర్తించి రోడ్డుకు వెంటనే రెండు వైపులా పెద్ద కాల్వల నిర్మాణం చేపట్టాలని అధికారుల దృష్టికి తీసుకువెళ్తానని ఆయన తెలపడం జరిగింది