
జనం న్యూస్ నందలూరు కడప జిల్లానందలూరు మండల కేంద్రంలోని నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచా యతీ పరిధిలోగల అరవపల్లె శ్రీ కృష్ణ గీత మందిరం నందు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ కృష్ణ కళ్యాణం మహోత్సవం నిర్వహించ నున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు కుర్ర మణి యాదవ్ తెలిపారు ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రావణ బహుళ అష్టమి సంద ర్భంగా 3వతేదీ సాయంత్రం 5 గంటలకు మూల విరాట్లు, ఉత్సవ మూర్తులకు అభిషేక కార్యక్రమం, 4న ఉదయం 8 గంటలకు గోపూజ, ఉదయం 9 నుంచి 10:30 గంటల మధ్య శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ కళ్యాణం అనంతరంపుష్పయాగం, నవ విధహార తులు,ఉంటాయన్నారు,కళ్యా ణానికి వచ్చే మహిళలకు పసుపు, కుంకుమ, గాజులు, దారం, ముత్యాల తలంబ్రాలు అందజేయనున్నట్లు ఆయన తెలిపారు.