
జనం న్యూస్ ఆగస్టు 5 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ శ్రావణమాసాన్ని, గోకులాష్టమిని పురస్కరించుకుని 4వ శ్రావణ శుక్రవారం రోజున ఏర్పాటుచేసిన ఆధ్యాత్మిక ప్రవచనముతో శ్రవణానంద, నయనానంద శోభతో ధార్మిక వెల్లివిరిసింది. నంది అవార్డు గ్రహీత,తెలుగు ఆచార్యులు మహిళా కీర్తిరత్న జాతీయ పురస్కార గ్రహీత, కళతపస్వి అవార్డు గ్రహీత, విద్యావేత్త,ఆధ్యాత్మికవేత్త ప్రవచన కర్త అయిన ఏ బాల సౌజన్యకుమారి చే భాగవత లీలా ప్రవచనం శ్రీకృష్ణతత్వం జీవన సన్మార్గ వారధి అనే అంశం పైన ప్రవచనం జరిగింది. శ్రీకృష్ణతత్వం అంటే ప్రేమ పూర్వక విధానం శ్రీకృష్ణుడు జగద్గురువు గురువులందరికి గురువు కృష్ణం వందే జగద్గురు అనే విషయాన్ని పండిత పామరులకు సైతం అర్థమయ్యే విధంగా జీవితానికి ఉదహరిస్తూ చాలా చక్కగా వివరించారు. శ్రీకృష్ణుడు లీలలు అన్ని కృష్ణతత్వం కోసం ప్రతిబింబించే విధంగా చేశాడని చెప్పారు. చెరసాలలో పుట్టినప్పటికీ శంఖచక్ర గధ ధారుడై నవ్వుతూ జన్మించాడని ప్రతి మనిషి లోకంలో కొన్ని కొన్ని విషయాలకి శోకంతో కాకుండా ఆనందంతో నవ్వుతూ ఉండడమే కృష్ణ తత్వం అని అన్నారు. కర్మాన్యే వాధికారస్తే మా పలేషు కదాచన అనగా కర్మ చేయడం మన వంతు ఫలితం భగవంతుడు ఒంతు అని వివరించారు.విద్యార్థి దశ నుంచి కృష్ణ తత్వాన్ని ఎవరైతే అవలంబిస్తారో వారు ఖచ్చితంగా జీవితంలో విజయాలు సొంతం చేసుకుంటారు అని చెప్పారు. మానవుడు ప్రగతి పథంలో జీవించాలి కానీ పగ ప్రతీకార పధం లో జీవించడం కృష్ణ తత్వం కాదు అని చెప్పారు. సాటి మనుషులని పక్షులను జంతువులను ముఖ్యంగా మన చుట్టుపక్కల ఉన్న ప్రకృతిని ఆరాధించి ప్రేమించడమే కృష్ణ తత్వం అని, శ్రీకృష్ణుడు తన శిరస్సులో ధరించిన నెమలి పించము గురించి వర్ణన చేస్తూ ప్రకృతి ప్రేమికుడు కృష్ణుడు అని తెలుపుటకు ఉదాహరణ ఇది అని వివరించారు. మన గృహంలో ఏదైనా వస్తువు కొనినప్పుడు దానికి యూజర్ మాన్యువల్ పుస్తకం ఎటువంటి విధంగా ఇస్తారో మన జీవితంలో మనం ఎటువంటి విధంగా నడచు కోవాలి ఎలా ఆలోచన చేయాలి ఎలా ఉండాలి ఏమి తినాలి ఏమి మాట్లాడాలి ఏమి మాట్లాడకూడదు అనే విషయాలన్నీ తెలిపేదే మన జీవిత యూజర్ మాన్యువల్ భగవద్గీత అని వివరించి చెప్పారు.అన్ని విషయాలను ఎక్కువగా ఆలోచన చేసి మనస్థాపానికి లో నయ్యి ఆత్మహత్యలు చేసుకోవడం అనేది మన జీవితాన్ని నాశనం చేసే ఆలోచన అని చెప్తూ కృష్ణ తత్వంలో కృష్ణుడు ఎటువంటి కష్టాలు వచ్చిన కాళీయ మర్దనము చేసి సర్పము ను హతమార్చడం, గోవర్ధనగిరి అనే గిరిని తన యొక్క చిటికెనవేలు పై పెట్టుకుని పైకి ఎత్తడం చాలా సునాయసంగా చేశాడు. కృష్ణ తత్వం లో మన నడకని ప్రారంభిస్తే కృష్ణుడు మనకు తోడుగా ఉంటాడు అని వివరించారు. యశోద మత స్వయంగా తన చేతితో చేసిన ఆహార పదార్థాలను కృష్ణుడు చాలా ఇష్టంగా భుజించేవాడు అటువంటి విధంగా ప్రస్తుత సమాజంలో తల్లులు మాతృమూర్తులు అందరూ తమ యొక్క చిన్నారులకి స్వయంగా చేసి ఆహారాన్ని అందిస్తే ఆరోగ్యం ఆనందం మొబైల్స్ టీవీలు సీరియల్స్ పక్కనపెట్టి పిల్లల సంరక్షణలో తల్లి నిమగ్నం అయితే కృష్ణుడు లాంటి జగద్గురువులు మళ్లీ భూమి మీద ఉద్ధరిస్తారని కొనియాడారు. కృష్ణాష్టమి యొక్క అర్ధాన్ని కూలంకషంగా వివరించారు. కృష్ణాష్టమి వేడుకలు ఎందుకు జరుపుకుంటాం ఉట్టి కొట్టే సంప్రదాయాన్ని అర్థమయ్యే రీతిలో వివరించి చెప్పారు. వెన్నదొంగలీలలో ఉన్న అర్దాన్ని చాలా చక్కగా కృష్ణతత్వం లో ఉన్న అంతరార్థాన్ని అద్భుతంగా వర్ణించారు. మన యొక్క స్వచ్ఛమైన నిష్కల్మషమైన మనసులను, మనసు అనే తెల్లని పదార్థమును కృష్ణుడు వెన్న అనుకుని దొంగలిస్తాడని అనగా స్వచ్ఛంగా ఉంటే కృష్ణుడికి మనం నచ్చుతామని మనల్ని కృష్ణుడు ప్రేమిస్తాడని వివరించారు. కృష్ణుడు చేసిన బాల్య లీలలను కృష్ణ తత్వంలో ఉండే అర్ధాన్ని కుమారుడిగా, హితుడిగా,అన్నదమ్ముడుగా, భర్తగా, ప్రేమికుడిగా గురువుగా అన్ని బంధాలలో కృష్ణుడు తనదైన ప్రేమను అందరికీ పంచాడు అని రమణీయంగా వర్ణిస్తుంటే ప్రేక్షకులు హర్షద్వానాలు హోరెత్తించారు. సంతోష్ మాత దేవస్థాన చైర్మన్ మారిశెట్టి భాస్కర రావు మాజీ చైర్మన్ దాడి వాసు ధర్మకర్తల మండలి ఈశ్వరరావు, కిరణ్ సన్యాసినాయుడు, రాజేష్, రాధ, మోహన్ ఇతర సభ్యులు సౌజన్య గారిని జ్ఞాపిక శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం దేవస్థాన ప్రాంగణంలో జరిగిన రంగవల్లికల పోటీలో సౌజన్య న్యాయ నిర్ణేయతగా వహించి ప్రధమ రాధికా 3000/-,ద్వితీయ జయ మాధురి 2000/-,తృతీయ కృష్ణ వేణి లకు 1000/- నగదు బహుమతులను సౌజన్య చేతుల పైన మరియు ధర్మకర్తల మండలి ఆలయ కమిటీ సభ్యుల చేతులు పైన ప్రధానం చేశారు.//