
జనం న్యూస్ మే 28 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ తెలుగు దేశం పార్టీ మహానాడు సందర్భంగా అన్న ఎన్టీఆర్ జయంతి రోజున 11వ కస్టర్ లో మహానాడు ముగింపు సమావేశం సందర్భంగా గవర కార్పొరేషన్ చైర్మన్ 11వ కస్టర్ కన్వీనర్ మల్ల సురేంద్ర సీనియర్ కార్యకర్తలను జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ సూచనలతో కొంతమంది సీనియర్ కార్యకర్తలను సత్కరించాలని సభలో నిర్ణయించి 1983 నుండి పనిచేసిన కార్యకర్తలను గుర్తించి వారిలో 1.యల్లపు రాము 2.మద్దాల వరహా 3. పీలా శ్రీనివాసరావు 4. కైచర్ల ప్రకాష్ లోకేష్ 5. ఎండకుర్తి అప్పలరాజు 6. పెట్ల శ్రీను వారికి డాక్టర్ నారాయణరావు, చక్రవర్తి, సూర్యప్రభ సత్యనారాయణ తదితరులు శాలువా తో సత్కరించి ₹ 1000 బహుమతిగా మల్ల సురేంద్ర ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా సురేంద్ర మాట్లాడుతూ దశలవారీగా వేర్వేరు కార్యక్రమంలో సీనియర్ కార్యకర్తలు, కస్టర్డ్ లో బూత్ లెవెల్లో పనిచేసిన కార్యకర్తలను గుర్తించి వారిని కూడా సత్కరించడానికి నిర్ణయం తీసుకున్నామని అనే నినాదాన్ని మా వార్డులో అమలు చేస్తామని సురేంద్ర అన్నారు. ఈ కార్యక్రమంలో కొణతాల వెంకటరావు కాండ్రేగుల చిన్న బుద్ధ కాశీ విశ్వేశ్వర రావు పొలిమేర నాయుడు తిప్పాన అప్పారావు మల్ల సూరిబాబు మారిశెట్టి శంకర్రావు సిలపరశెట్టి శ్రీను మల్ల రవి గోవింద దాడి వాసు తదితరులు పాల్గొన్నారు.//