జనం న్యూస్, అక్టోబర్ 10,అచ్యుతాపురం :అచ్యుతాపురం మండలం మడుతూరు గ్రామానికి చెందిన ఉమ్మడి విశాఖ జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి మోటూరు శ్రీవేణి ను జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ అనకాపల్లి పార్లమెంట్ స్థానిక సంస్థల సమన్వయకర్తగా నియమించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీ అధ్యక్షులు అన్నయ్య కొణిదల పవన్ కళ్యాణ్ ఎలమంచిలి సుందరపు విజయ్ కుమార్ తనపై నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యతను అప్ప చెప్పినందుకు తన శక్తివంతన లేకుండా పార్టీ తనకు సూచించిన బాధ్యతలను తూచా తప్పకుండా పాటిస్తూ కూటమి సమన్వయం కోసం పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తానని అధ్యక్షుల వారికి ఎమ్మెల్యేకి ఉత్తరాంధ్ర జనసేన పార్టీ ముఖ్య ప్రతినిధి సతీష్ కుమార్ కి ధన్యవాదాలు తెలిపారు