జనం న్యూస్ అక్టోబర్ 11 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్‌లో ఈరోజు నిర్వహించిన శ్రీ పవర్ ఉమెన్ సేఫ్టీ బైక్ ర్యాలీలో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మరియు కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ బండి రమేష్ కుమార్తె మనశ్విని మంత్రులతో కలిసి పాల్గొన్నారు.మహిళల భద్రత, రక్షణ, ఆత్మవిశ్వాసం మరియు మహిళా సాధికారతపై అవగాహన కల్పించే లక్ష్యంతో నిర్వహించిన ఈ బైక్ ర్యాలీలో మనశ్విని పాల్గొనడం విశేషం. మహిళల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, మహిళలు అన్ని రంగాల్లో ధైర్యంగా ముందుకు సాగాలనే సందేశాన్ని ఈ కార్యక్రమం చాటిచెప్పింది.