జనం న్యూస్ అక్టోబర్ 10 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు.ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ పండుగ మొదటి రోజు ఘనంగా నిర్వహించారు మండలంలోని పత్తిపాక గ్రామంలో శ్రీ హనుమంతుని దేవాలయంలో శనివారం రోజున ఎంగిలిపూల బతుకమ్మను స్థానిక మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని బతుకమ్మలను వివిధ పువ్వులతో అందంగా పేర్చి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, బతుకమ్మల చుట్టూ చేరి ఆటపాటలతో సందడి చేశారు. తెలంగాణ సంప్రదాయ పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ బతుకమ్మ వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. పూల పండుగతో ఆలయ ప్రాంగణాలు పండుగ శోభను సంతరించుకున్నాయి. మహిళల ఆనందోత్సాహాల మధ్య ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో తల్లి దివ్యాంగుల సేవాసమితి అధ్యక్షులు బీ ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గజ్జి శంకర్ గ్రామ మహిళలు పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు…