జనం న్యూస్, అక్టోబర్ 13, అచ్యుతాపురం : అచ్యుతాపురం మండలం ఉప్పవరం సచివాలయం వద్ద మంగళవారం ఏపీ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రాయితీపై పశు దాణా పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతులకు 50% రాయితీతో 18 పశువుల దాణా బస్తాలు అందించారు. పశుసంవర్ధక శాఖ అధికారులు రైతులకు రాయితీపై దాణా యొక్క ప్రాముఖ్యతను వివరించారు. నాణ్యమైన దాణా అందించడం వల్ల పాడి పశువుల ఆరోగ్యంతో పాటు పాల ఉత్పత్తి కూడా పెరుగుతుందని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ కూనిశెట్టి సత్తిబాబు, కొలగాని శేషు, చిన్ని శేషు, కోమాకుల ప్రసాద్, పశుసంవర్ధక శాఖ కుసుమ తదితర రైతులు పాల్గొన్నారు.