ఆంధ్రప్రదేశ్

ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే శ్రీ హన్మంత్ షిండే !

ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే శ్రీ హన్మంత్ షిండే !

మద్నూర్ అక్టోబర్ 13 జనం న్యూస్జు క్కల్ నియోజకవర్గం, మద్నూర్ మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ప్రతిష్టాత్మక ఇంటిగ్రేటెడ్ స్కూల్ (సమీకృత పాఠశాల) భవన నిర్మాణ పనులను ఈరోజు బిఆర్ఎస్ పార్టీ జుక్కల్ నియోజకవర్గ నాయకులు, మాజీ శాసనసభ్యులు శ్రీ హన్మంత్ షిండే గారు మద్నూర్ మండల నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ నాణ్యతపై శ్రీ హన్మంత్ షిండే గారు కాంట్రాక్టర్లకు, అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా ప్రస్తుతం ‘ఎల్ నినో’ (El Niño) ప్రభావం వల్ల ఆశించిన స్థాయిలో వర్షాలు లేవని, వాతావరణం పొడిగా ఉన్నందున భవన నిర్మాణంలో ‘క్యూరింగ్’ (Curing) ప్రక్రియను అత్యంత నిశితంగా, నిరంతరం నిర్వహించాలని సూచించారు. సరైన క్యూరింగ్ ఉంటేనే భవనం పటిష్టంగా ఉంటుందని పేర్కొంటూ.. పనుల్లో ఎలాంటి అలసత్వం వహించకుండా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇ-పేపర్