జనం న్యూస్ : 14అక్టోబర్వ నపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీ అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన గణపురం భవాని గారికి సంగారెడ్డి శ్రీ రాజరాజేశ్వరి మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు వచ్చిన సందర్భంగా మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు శాలువా కప్పి అభినందించడం జరిగింది. వారు మాట్లాడుతూ, విద్య అని రంగాలలో మంచి అభివృద్ధి ఇస్తుందని, ప్రతి ఒక్కరు ఉన్నత స్థాయిలో ఉండాలని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరియు 1వ వార్డు కౌన్సిలర్ & మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ఎద్దుల కరుణ శ్రీ సాయినాథ్ గారు అదేవిధంగా కౌన్సిలర్లు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు యువకులు కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.