ఆంధ్రప్రదేశ్

కేపీహెచ్‌బీ కాలనీలో మిస్ అండ్ మిస్సెస్ ఉమెన్స్ డ్రెస్సెస్ షోరూం ప్రారంభంనాణ్యమైన వస్త్రాలను సరసమైన ధరలకు అందించాలి: జనంపల్లి పురేందర్ రెడ్డి

కేపీహెచ్‌బీ కాలనీలో మిస్ అండ్ మిస్సెస్ ఉమెన్స్ డ్రెస్సెస్ షోరూం ప్రారంభంనాణ్యమైన వస్త్రాలను సరసమైన ధరలకు అందించాలి: జనంపల్లి పురేందర్ రెడ్డి

జనం న్యూస్ అక్టోబర్ 14 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్‌పల్లి పరిధిలోని కేపీహెచ్‌బీ కాలనీ మెయిన్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన మిస్ అండ్ మిస్సెస్ ఉమెన్స్ డ్రెస్సెస్ క్లాత్ షోరూంను రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జనంపల్లి పురేందర్ రెడ్డి బుధవారం ఉదయం పది గంటలకు ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూం యజమానులు అభిలాష్ రెడ్డి, జయంత్ కుమార్, వి. వి. రెడ్డిలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జనంపల్లి పురేందర్ రెడ్డి మాట్లాడుతూ, వస్త్ర వ్యాపార రంగంలో వినియోగదారుల నమ్మకాన్ని సంపాదించుకోవడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. నాణ్యమైన దుస్తులను సరసమైన ధరలకు అందుబాటులో ఉంచడంతో పాటు, వినియోగదారులకు ఆకర్షణీయమైన ధరలు, మెరుగైన సేవలు అందించాలని షోరూం యజమానులకు సూచించారు. నాణ్యత, నమ్మకం, వినియోగదారుల సంతృప్తికి ప్రాధాన్యత ఇస్తే వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. కొత్తగా వ్యాపార రంగంలో అడుగుపెట్టిన యువ పారిశ్రామికవేత్తలు వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా నూతన డిజైన్లు, నాణ్యమైన వస్త్రాలను అందుబాటులో ఉంచుతూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. వ్యాపారంలో మంచి పేరు సంపాదించుకుంటూ ప్రజల ఆదరణ పొందాలని యజమానులకు సూచించారు. అనంతరం షోరూం యజమానులు అభిలాష్ రెడ్డి, జయంత్ కుమార్, వి.వి. రెడ్డిలను జనంపల్లి పురేందర్ రెడ్డి అభినందించి, వారి వ్యాపారానికి తన ఆశీస్సులు అందజేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు జి. నర్సింగ్ రావు, శ్రీధర్, జి. ప్రసాద్, గణేష్, మురళి తదితరులు పాల్గొన్నారు. నూతన షోరూం ప్రారంభం సందర్భంగా యజమానులకు శుభాకాంక్షలు తెలియజేసి, వ్యాపారం విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.

ఇ-పేపర్