ఆంధ్రప్రదేశ్

ఆలేరు మండలంలో ప్రభుత్వ విప్ బిర్ల ఐలయ్య విస్తృత పర్యటన

ఆలేరు మండలంలో ప్రభుత్వ విప్ బిర్ల ఐలయ్య విస్తృత పర్యటన

జనం న్యూస్ 14 ఆలేరు యాదాద్రి జిల్లా మండల రిపోర్టర్ ఎండి జహంగీర్ ఆలేరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య బుధవారం మండలంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో మదర్ డెయిరీ పాల ఉత్పత్తిదారులకు బోనస్‌ల పంపిణీ, అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల అందజేత, బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపనతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. మండలంలోని గొలనుకొండ, శారాజీపేట, మందనపల్లి గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో మదర్ డెయిరీ పాల ఉత్పత్తిదారులైన రైతులకు బోనస్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన ఎమ్మెల్యే వారి సమస్యలు, సంక్షేమానికి సంబంధించిన అంశాలను తెలుసుకున్నారు. పాల ఉత్పత్తిదారులను ప్రోత్సహించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటు అందించవచ్చని పేర్కొన్నారు. పట్టణంలోని మైనారిటీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో అర్హులైన లబ్ధిదారులకు నూతన స్మార్ట్ రేషన్ కార్డులను బీర్ల ఐలయ్య పంపిణీ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఖమ్మం–వరంగల్–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణ, పార్టీ శ్రేణుల సమన్వయం, ప్రచార కార్యక్రమాలపై నాయకులు, కార్యకర్తలతో చర్చించారు. ఎన్నికల నేపథ్యంలో చేపట్టాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. మండలంలోని గుండ్లగూడెం గ్రామం వద్ద బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడంతో పాటు ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

ఇ-పేపర్