ఆంధ్రప్రదేశ్

పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి : పూడూరు తాసిల్దార్ విజయ్ కుమార్.

పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి : పూడూరు తాసిల్దార్ విజయ్ కుమార్.

జనం న్యూస్ అక్టోబర్ 15, వికారాబాద్ జిల్లా పూడూరు మండలం, ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పట్టబద్రులు అందరూ ఓటు హక్కు కోసం ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని పూడూరు మండలం తాసిల్దార్ విజయకుమార్ అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ఎంతో కీలకమని అర్హత కలిగిన ప్రతి ఒక్కరు పట్టబద్రులు ఈ అవకాశాన్ని వినియోగించు కోవాలని అన్నారు. 2023 అక్టోబర్ 31వ, తేదీ నాటికి డిగ్రీ లేదా దీనికి సమానమైన విద్యార్హతకు పూర్తి చేసిన వారు ఓటు హక్కు నమోదు కోసం దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.

ఇ-పేపర్