జనం న్యూస్ అక్టోబర్ 17 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి నల్లగొండ జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ పి ఆర్ టి యు రాష్ట్ర కౌన్సిల్ ఎన్నికల్లో హనుమకొండ జిల్లా, శాయంపేట మండలంలోని మందారిపేట ఉన్నత పాఠశాలలో బయోసైన్స్ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న కంప సంధ్య రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా సంధ్య మాట్లాడుతూ, తన ఎన్నికకు సహకరించిన టీచర్ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి కి, రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు, హనుమకొండ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు, అలాగే తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై నమ్మకంతో రాష్ట్ర స్థాయి బాధ్యతను అప్పగించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, ఉపాధ్యాయుల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు. కంప సంధ్య రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షురాలిగా ఎన్నిక కావడం పట్ల శాయంపేట మండల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.