జనం న్యూస్ అక్టోబర్ 17 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ఖైతలాపూర్ దుర్గమ్మ తల్లి ఆలయం, చిత్తరామ టెంపుల్, బేగంపేట్లో ప్రత్యేక పూజలు దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మరియు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బండి రమేష్ వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఖైతలాపూర్లోని దుర్గమ్మ తల్లి ఆలయంలో ప్రకాష్ ముదిరాజ్ ఆహ్వానం మేరకు, చిత్తరామ టెంపుల్లో తూము వేణు ఆహ్వానం మేరకు, అలాగే బేగంపేట్లో రమేష్ ఆహ్వానం మేరకు నిర్వహించిన నవరాత్రి ఉత్సవాలకు బండి రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని బండి రమేష్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.