తెలంగాణ

కూకట్‌పల్లిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.

కూకట్‌పల్లిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.

వడ్డేపల్లి రాజేశ్వరరావు నివాసంలో సంప్రదాయబద్ధంగా బతుకమ్మ సంబరాలు జనం న్యూస్ అక్టోబర్ 17 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు కూకట్‌పల్లిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు నివాసంలో ఆయన కుమార్తె కుటుంబ సభ్యులతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మల చుట్టూ మహిళలు చేరి బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటపాటలతో పండుగ సందడిని నింపారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో బతుకమ్మ పండుగ కీలక పాత్ర పోషిస్తుందని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు. పూల పండుగగా పేరుగాంచిన బతుకమ్మ వేడుకలు మహిళల్లో ఐక్యతను, ఆత్మీయతను పెంపొందిస్తూ పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చాయి.

ఇ-పేపర్