తెలంగాణ

ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

జనం న్యూస్ అక్టోబర్ 18 చిలిపి చెడు మండల ప్రతినిధిమెదక్ జిల్లాచిలప్ చెడ్ మండలంలోని అంతారం, చండూర్, జగ్గంపేట్ గ్రామాలలో శనివారం నాడు సద్దుల బతుకమ్మను మహిళలు ఘనంగా జరుపుకున్నారు. మహిళలు వివిధ రకాల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను ముందు తమ ఇంటి ఎదుట వేసిన ముగ్గులతో బతుకమ్మలను ఉంచి పాటలు పాడారు. అనంతరం గ్రామంలోని ప్రధాన చవిడి వద్ద, హనుమాన్ ఆలయం ముందు బతుకమ్మలను చేర్చి ఒక్కేసి పోవేసి చందమామ.. చిత్తు చిత్తుల బొమ్మ.. అంటూ మహిళలు పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. మహిళలు, బతుకమ్మల వద్ద కోలాటం, దాండియా ఆడారు.అనంతరం ఆయా గ్రామాల్లోని చెరువులు, కుంటల్లో బతుకమ్మ నిమజ్జనం చేశారు. మహిళలు వాయినాలను ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో అంతారం సర్పంచ్ పంబాల భాగ్యలక్ష్మి భూమేష్, జగ్గంపేట సర్పంచ్ స్రవంతి, అంతారం ఉప సర్పంచ్ కుమ్మరి యాదయ్యమాజీ సర్పంచ్ అశోక్ గౌడ్, బర్ల నరహరి, ప్రకాష్ గౌడ్, మల్లాగౌడ్,సామ్య నాయక్, జనార్ధన్, బాసడి అశ్విని సాయి,సత్యనారాయణ గౌడ్, హరికృష్ణ, సునీల్, గొల్ల సురేష్, పంబాల కృష్ణ,పంబాల నర్సింలు, మంగలి రమేష్, సందీప్ గౌడ్,యాదగౌడ్,ప్రవీణ్ గౌడ్,శేఖర్ గౌడ్, రామకృష్ణ,బాలకిషన్,శేఖర్, మహేష్ గౌడ్,మహిళలు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు ,గ్రామస్తులు యువకులు, తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్