జనం న్యూస్ అక్టోబర్ 18 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్, టి పి సి సి ఉపాధ్యక్షులు, కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టి ఇంచార్జ్ బండి రమేష్ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం కూకట్పల్లి నియోజకవర్గం మూసాపేట్ డివిజన్ లోని శ్రీ నల్ల పోచమ్మ దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఆలయ కమిటీ చైర్మన్ రాచమళ్ల బిక్షపతి గౌడ్ మరియు ఆర్. శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు, అంబేద్కర్ నగర్ శివ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కైతలాపూర్ డివిజన్ ప్రగతి నగర్ జిట్టా సునీల్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాన్ని సందర్శించి అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంజనేయ నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే శ్రీ సీతారామ కల్యాణ మండపం లో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగ బండి రమేష్ మాట్లాడుతు అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో నియోజకవర్గం బ్లాక్ అధ్యక్షులు తూము వేణు,పటోళ్ల నాగిరెడ్డి, మాజీ కౌన్సిలర్ తూము ఎల్లారావు, కర్క పెంటయ్య, తూము మనోజ్ కుమార్, డివిజన్ అధ్యక్షులు తూము సంతోష్, కాలికోట శంకర్, నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సలీం, మైనారిటీ అధ్యక్షులు ఎండీ చున్ను పాషా,కాంగ్రెస్ నాయకులు కాస నర్సింహా యాదవ్, భాశెట్టి ప్రభాకర్, సప్పిడి భాస్కర్, కాలికోట బాలరాజ్, ఎండీ నయీమ్, తూము సచిన్ కాంగ్రెస్ పార్టీ అన్ని విభాగాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, శ్రీ నల్ల పోచమ్మ ఆలయ కమిటీ సభ్యులు మరియు ప్రగతి నగర్, ఆంజనేయనగర్ కాలని అసోసియేషన్ నాయకులు సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.