జనం న్యూస్ అక్టోబర్ 19 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం పోలిస్ శాఖ ప్రధాన లక్ష్యమని, బతుకమ్మ, దసరా పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పరకాల ఏసీపీ సతీష్ బాబు అన్నారు అనంతరం ఏ సీ పీ కి సీఐ సుధాకర్ రెడ్డి, ఎస్పై పరమేష్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. శాయంపేట పోలీస్ స్టేషన్ లో వార్షిక తనిఖీలు నిర్వహించి పనితీరు, కేసుల దర్యాప్తు పురోగతి, రికార్డుల నిర్వహణను సమగ్రంగా సమీక్షించారు. స్టేషన్ పరిసరాలతో పాటు కేస్ డైరీ ఫైళ్లు, సీసీటీఎన్ఎస్ రికార్డులు, రౌడీషీటర్ల రిజిస్టర్లు, సస్పెక్ట్ షీట్లు, ఆన్లైన్ డేటాను క్షుణ్ణంగా పరిశీలించారు. సీసీటీవీ కెమెరాల పనితీరు, సీజ్ చేసిన వాహనాలు, సిబ్బంది కిట్లను తనిఖీ చేసి విధుల్లో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీటర్లు ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పండుగల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం సిబ్బంది నిరంతరం నిఘా ఉంచాలన్నారు. ప్రజలు సంబరాలను సంతోషంగా జరుపుకోవాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పనులకు దూరంగా ఉంటూ పోలీసులకు సహకరించాలని తెలియజేశారు…