ఆంధ్రప్రదేశ్

55వ వార్డులో అట్టహాసంగా ఉమా వెంకట రాఘవ కుమారి నామినేషన్ భారీ ర్యాలీతో ఎన్నికల బరిలోకి శీలం వీర వెంకట సత్యనారాయణమూర్తి సతీమణి – విద్యావంతురాలికి అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి

55వ వార్డులో అట్టహాసంగా ఉమా వెంకట రాఘవ కుమారి నామినేషన్ భారీ ర్యాలీతో ఎన్నికల బరిలోకి శీలం వీర వెంకట సత్యనారాయణమూర్తి సతీమణి – విద్యావంతురాలికి అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి

జనం న్యూస్ అక్టోబర్ 18 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో 55వ వార్డులో ఎన్నికల సందడి నెలకొంది. ఈ వార్డు నుంచి శీలం వీర వెంకట సత్యనారాయణమూర్తి సతీమణి ఉమా వెంకట రాఘవ కుమారి అభ్యర్థిగా నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించగా పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు, అభిమానులు, మహిళలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆమెకు ఘన స్వాగతం పలికారు. హారతులు ఇచ్చి, తిలకాలు దిద్ది తమ అభిమానాన్ని చాటుకున్నారు. విద్యావంతురాలిగా అవకాశం ఇవ్వండి – శ్రీ విద్యా వికాస్ పాఠశాలల డైరెక్టర్ అండ్ కరస్పాండెంట్ గా, ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ పాఠశాలల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శీలం వీర వెంకట సత్యనారాయణమూర్తి విద్యారంగంలో తనకున్న అనుభవాన్ని, ప్రజా సమస్యలపై తనకున్న అవగాహనను వివరిస్తూ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. విద్యావంతురాలైన ఉమా వెంకట రాఘవ కుమారికి ప్రజలు అవకాశం కల్పించి, అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకుని, వార్డులో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వాన్ని అందిస్తామని తెలిపారు. మహిళా నాయకత్వంతో అభివృద్ధికి కృషి – 55వ వార్డు ప్రజలు తమకు అవకాశం కల్పిస్తే, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. స్థానిక సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేయడంతోపాటు ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని వివరించారు. మహిళా అభ్యర్థిగా ఉమా వెంకట రాఘవ కుమారికి మద్దతు ఇచ్చి గెలిపిస్తే, వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు. ప్రజలు అందించే అవకాశాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటూ వారి ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామని అన్నారు. అభిమానుల కోలాహలం – నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యారంగానికి చెందిన పరిచయస్తులు, అభిమానులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉమా వెంకట రాఘవ కుమారికి శుభాకాంక్షలు తెలుపుతూ తమ మద్దతును ప్రకటించారు. విద్య, అనుభవం, ప్రజా సమస్యలపై అవగాహనతో 55వ వార్డు అభివృద్ధికి కృషి చేస్తామనే సందేశంతో ఉమా వెంకట రాఘవ కుమారి ఎన్నికల బరిలోకి దిగారు. ఈ నామినేషన్ కార్యక్రమం వార్డులో రాజకీయ సందడిని పెంచింది

ఇ-పేపర్