జనం న్యూస్ : 19 అక్టోబర్ సోమవారం సిద్దిపేట నియోజిక వర్గ ఇంచార్జి వై.రమేష్ ;ప్రముఖ బాలసాహితీవేత్త గరిపెల్లి అశోక్ రచించిన తాత- మనవరాళ్ళు, బల్లూకం తాత రెండు బాలసాహిత్య పుస్తకాల ఆవిష్కరణ సిద్దిపేటలో సోమవారం జరిగింది. జాతీయస్థాయిలో బాలసాహిత్యంలో విశేష కృషి చేస్తున్న గరిపెల్లి అశోక్ సేవలు మరువలేనివని, తెలంగాణ యాస, బాసలో బాలల కథలు రాయడమే కాకుండా పుస్తక రూపంలో అందజేసినందుకు సిద్దిపేటకు చెందిన బాల సాహితీవేత్తలు ఉండ్రాళ్ళ రాజేశం, పెందోట వెంకటేశ్వర్లు, బైతి దుర్గయ్య, వర్కోలు లక్ష్మయ్య, జెగ్గారి నిర్మల సురేష్ లు అభినందనలు తెలిపారు.