తెలంగాణ

సిద్దేశ్వరాలయంలో రుద్రాభిషేకం, కుంకుమార్చన ,

సిద్దేశ్వరాలయంలో రుద్రాభిషేకం, కుంకుమార్చన ,

జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్. బి వీరేశం అక్టోబర్ 19: జహీరాబాద్ పట్టణం అల్గోల్ రోడ్డు లోని శ్రీ మంగళ గౌరీ సమేత సిద్దేశ్వరాలయంలో అశ్వీయుజ సోమవారం సందర్భంగా రుద్రాభిషేకం, కుంకుమార్చన కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఆలయ ఈ ఓ శివరుద్రప్ప ఆదేశాల మేరకు అర్చకులు సంగమేశ్వర్ స్వామి ఈ క్రతువును నిర్వహించారు. జహీరాబాద్ కు చెందిన అశోక్ పాటిల్, మీరా పాటిల్, సిద్ధాంష్ పాటిల్, మనీషా పాటిల్ లు అర్చన కార్యక్రమం లో పాల్గొన్నారు. ప్రతి అమావాస్య తో పాటు ప్రతి సోమవారం నాడు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. శరన్నవరాత్రుల సందర్భంగా రాజ రాజేశ్వరి అమ్మవారిని రంగు రంగుల పుష్పలతో అలంకరించారు.

ఇ-పేపర్