జనం న్యూస్ అక్టోబర్ 23, ( జనం న్యూస్ రిపోర్టర్ పరిగి నియోజకవర్గం )వికారాబాద్ జిల్లా పరిగి పట్టణ కేంద్రంలోని బోయవాడ ప్రధాన రహదారిలో దేవాలయములకు వెళ్లే దారి అతి సమీపంలో డ్రైనేజీ వ్యవస్థ పొంగిపొర్లుతుంది. దీంతో మురుగునీరు రోడ్డుపైకి చేరి దుర్వాసన వెదజల్లుతుంది కాలనీవాసులు వాహనదారులు ముక్కు మూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది, మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా మా కాలనీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు, మున్సిపల్ కమిషనర్ వెంటనే స్పందించి డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలని ప్రజలకు ఇబ్బందులు తొలగించాలని కాలనీవాసులు కోరుతున్నారు.