తెలంగాణ

ఏ ఐ కే ఎం ఎస్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా

ఏ ఐ కే ఎం ఎస్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా

జనం న్యూస్ 23 ఆలేరు యాదాద్రి జిల్లా మండల రిపోర్టర్ ఎండి జహంగీర్. ఆలేరు మండల కేంద్రంలో అఖిల భారత రైతు-కూలీ సంఘం (ఏ.ఐ.కే.ఎం.ఎస్) ఆధ్వర్యంలో సంయుక్త కిసాన్ మోర్చా ఎస్ కే యం పిలుపులో భాగంగా శుక్రవారం రోజున తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కళ్లెపు అడవయ్య బేజాడి కుమారులు పాల్గొని మాట్లాడుతూ ఎస్.ఐ.ఆర్.ను తక్షణమే రద్దు చేయాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను వెంటనే తొలగించి, ఆయనపై విచారణ జరపాలని, పారదర్శకత లేకుండా ఓటర్ల జాబితా నుండి తొలగించబడిన 13.41 కోట్ల మంది పౌరులందరికీ ఓటు హక్కును పునరుద్ధరించాలని, ఎంపిక ప్యానెల్‌లో క్యాబినెట్ మంత్రి స్థానంలో భారత ప్రధాన న్యాయమూర్తిని నియమించేలా ‘ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు ఇతర ఎన్నికల కమిషనర్ల (నియామకం, సేవా నిబంధనలు మరియు పదవీకాలం) చట్టం, 2023’కు సవరణ చేయాలని, పదవీ విరమణ తర్వాత కూడా ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఈసి), ఎన్నికల కమిషనర్లకు (ఈ సి ఎస్) చట్టపరమైన రక్షణ కల్పించే సెక్షన్ 16ను రద్దు చేయాలి. ఆమె ఈ సెక్షన్, హైకోర్టు లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు లభించే రక్షణల కంటే కూడా విస్తృతమైనదని సుప్రీంకోర్టు తన వ్యాఖ్యలలో పేర్కొందని రైతులు, సాధారణ ప్రజలు క్రియాశీలంగా ఏకం కావాలని, బీజేపీ కి జేబు సంస్థగా వ్యవహారిస్తున్న ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పాల్గొన్నవారు జిల్లా గౌరవాధ్యక్షులు మామిడాల సోమయ్య, ఉపాధ్యక్షులు చిరబోయిన రాజయ్య, మామిడాల బాల మల్లేష్, సహాయ కార్యదర్శి తమ్మడి అంజయ్య, కోశాధికారి బర్మా బాబు, జిల్లా నాయకులు చిరబోయిన కొమరయ్య, తదితర నాయకులు పాల్గొన్నారు.

ఇ-పేపర్